రాజ్ పాకాల పరారీలో ఉన్నారు: ఎక్సైజ్ పోలీసులు

  • కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసుల దాడులు
  • ఏడు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్న ఎక్సైజ్ సీఐ
  • ఈ కేసులో రాజ్ పాకాల ఏ2గా ఉన్నారని వెల్లడి
జన్వాడ ఫాంహౌస్ పై దాడులు జరిగిన అనంతరం రాజ్ పాకాల పరారీలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించారని, 7 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, అందులో కర్ణాటక మద్యంతో పాటు విదేశీ లిక్కర్ కూడా ఉందని ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. 

ఈ కేసులో ఏ1గా ఫాంహౌస్ సూపర్ వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాల ఉన్నారని వివరించారు. దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే మరికొన్ని విషయాలు వెల్లడవుతాయని తెలిపారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై గతరాత్రి పోలీసులు దాడులు చేపట్టడం తెలిసిందే.

Raj Pakala
On The Run
Excise Police
Hyderabad

More Telugu News